Sunday 6 March 2016

Rana Bunny

రానా... బన్నీ.. సెన్సేషన్


సంగీత హోరుతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరైంది. 11లక్షల వాట్స్ సౌండ్స్ తో భారీస్థాయిలో నిర్వహించిన ప్రపంచ స్థాయి సంగీత ప్రదర్శన కార్యక్రమం సెన్సేషన్ ఘనంగా విజయవంతమైంది. సినిమా తారలు - వ్యాపార వేత్తలు - ఐఏఎస్ లు - ఐపీఎస్ లు ఈ వేడుకకి హాజరయ్యారు.  ప్రతి ఒక్కరూ తెలుపు  దుస్తుల్లోనే వచ్చారు. ఇక రాక్ మ్యూజిక్ హోరుని విని  ప్రతి ఒక్కరూ ఆనందంతో ఎగిరి గంతులేశారు. అలాంటి చోట అల్లు అర్జున్ - రానాలాంటి యంగ్ హీరోలుంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ఇద్దరూ ఇద్దరే అన్నట్టు తెగ అల్లరి చేశారు. ఒకరిపై మరొకరు ఎక్కేసి డ్యాన్సులేశారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రానా. సెన్సేషన్ మ్యాడ్ నెస్ అంటూ తాము ఏస్థాయిలో సందడి చేశామో ఆ ఫొటోలో చూపించేశాడు. 

ఈ వేడుకకి హాజరైన ప్రతి ఒక్కరూ తెల్లటి వస్త్రాలు ధరించారు. యూనిఫామ్ వేసుకురాలేకపోయిన వారిని వెనక్కి పంపించేశారు.  అఖిల్ - నాగార్జున - వెంకటేష్ - వరుణ్ తేజ్ - రవితేజ - రకుల్ - రెజీనా... ఇలా సినిమా పరిశ్రమంతా అక్కడే కనిపించింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ డ్యాన్స్ షోలో ఆడిపాడారు. ఈ మ్యూజిక్ షోకి చాలా ప్రత్యేకతలున్నాయి. 38 దేశాల్లో వంద ప్రదర్శనలు ఇచ్చిన సెన్సేషన్ మన దేశంలో తొలిసారి హైదరాబాద్ లో జరగడం విశేషం. ఈ షోకోసం మ్యూజిక్కి సంబంధించి సిస్టమ్సే 30 కంటైనర్లలో వచ్చాయట. అంటే ఎంత భారీస్థాయి కార్యక్రమమో అర్థం చేసుకోవచ్చు.  శనివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో ఈ వేడుక జరిగింది. భారీ శబ్ధాలతో జరిగిన వేడుక కాబట్టి ఆ ప్రాంతమంతా సంగీత హోరుతో మార్మోగిపోయింది. 

No comments:

Post a Comment