Sunday 6 March 2016

మెగా ఫ్యాన్స్ ని భయపెడుతున్న శ్రీను వైట్ల

మెగా ఫ్యాన్స్ ని భయపెడుతున్న శ్రీను వైట్ల

Srinu-Vaitlaఓక డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోతో కాదు మామూలు హీరోతో సినిమా తీసినా హిట్ అవుతుంది.  అదే ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోతో సినిమా అంటే కూడా ప్రేక్షకులు భయపడడం కామనే. శ్రీను వైట్ల గతంలో మంచి హిట్ సినిమాలే డైరెక్ట్ చేశాడుగానీ ఈ మధ్య భారీ డిజాస్టర్ సినిమాలను డైరెక్ట్ చేస్తూ ప్రేక్షకులను భయపెట్టాడు.  మహేష్ బాబు, చరణ్ లాంటి స్టార్ హీరోలని డైరెక్ట్ చేసి బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లు ఇవ్వడంతో శ్రీను వైట్లకు మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. శ్రీను వైట్ల ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు.
ఈ సినిమా హిట్ అవుతుందో లేదో గానీ సెంటిమెంట్ మాత్రం వరుణ్ తేజ్ కి వ్యతిరేకంగా ఉందట.  ఇప్పటివరకూ శ్రీను వైట్ల మెగా ఫ్యామిలీ తో రెండు సినిమాలు చేస్తే రెండూ డిజాస్టర్లే. మెగాస్టార్ చిరంజీవి తో చేసిన అందరివాడు, మెగా పవర్ స్టార్ తో చేసిన బ్రూస్ లీ రిజల్ట్ ఏమయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు శ్రీను వైట్ల ముచ్చటగా మూడో సారి  మెగా ఫ్యామిలీ హీరో అయిన వరుణ్ తేజ్ తో సినిమా అనగానే రిజల్ట్ ఏమౌతుందో అని మెగా అభిమానులు  ఇప్పటినుంచే భయపడుతున్నారట.

No comments:

Post a Comment