Monday, 7 March 2016

Prabhas Movie After Bahubali-2

రెండూ ఒకేసారి అంటున్న ప్రభాస్…

Prabhas-Stylishరెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మూడేళ్ళ నుంచి ఒకటే సినిమా…  అదే బాహుబలి. కళ్ళు మూసినా అదే తెరిచినా అదే. ఇంకా రెండేళ్ళు బాహుబలి హంగామా తగ్గదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో బాహుబలి 2 ని రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ వచ్చింది కదా.  ఏప్రిల్ లో బాహుబలి 2 రిలీజ్ అయితే, దాని తర్వాత 2018 ఏప్రిల్ దాకా దాని హంగామా కంటిన్యూ అవుతుంది.  అంతా ఓకే…  మరి ప్రభాస్ వేరే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు చేసేదెప్పుడు?  బాహుబలి షూటింగ్ పార్ట్ ఈ ఏడాది ఆఖరు లోపు కంప్లీట్ అవుతుంది కాబట్టి అప్పుడే ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందట. Capturewhite
ఇందులో ఉన్న కొత్త అప్డేట్ ఏంటంటే ప్రభాస్ కొత్త సినిమా ఒక్కటి కాదు… రెండు సినిమాలు ఒకేసారి లాంచ్ అవుతాయట.  ఇదివరకే సుజిత్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కదా.  దాంతో పాటు జిల్ డైరెక్టర్ రాధా కృష్ణ డైరెక్షన్ లో కూడా మరో సినిమాకు కూడా ప్రభాస్ పచ్చ జెండా ఊపాడు.  సుజిత్, రాధాకృష్ణలిద్దరూ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దీంతో రెండూ సినిమాల షూటింగ్ ఒకేసారి చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఈ రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసేది UV క్రియేషన్స్ బ్యానర్ మీద కావడం మరో విశేషం.

No comments:

Post a Comment