Friday 4 March 2016

Mass Maharaja replaced Bunny

ఆ రీమేక్ చేసేది బన్నీ కాదు … మాస్ మహారాజా !

ravi-teja-balapu-dc-28_0_0
ఈమధ్య టాలీవుడ్ లో రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది కదా. మెగా స్టార్ చిరంజీవి దగ్గర నుంచి మొదలు పెడితే సుమంత్ అశ్విన్ దాకా అందరూ రీమేక్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు.  దీంతో మలయాళం, తమిళ భాషలలో ఏదైనా సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు తెలుగులో ఏ హీరో చేస్తాడు అన్న డిస్కషన్ లు మొదలవుతున్నాయి.  ఇదే దారిలో ఈమధ్య ‘కనిదన్’ అనే సినిమా మంచి హిట్ అయింది.  ఈ సినిమాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడంటూ వార్తలు వచ్చాయి.  బట్.. ఫ్రెష్ టాక్ ఏంటంటే ఈ సినిమా బన్నీ కాదట, మాస్ మహారాజా రవి తేజ చేస్తున్నాడట.  Capturewhite
నకిలీ సర్టిఫికేట్ ల కు సంబంధించిన స్కామ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టొరీ రన్ అవుతుంది.  హీరో కూడా నకిలీ సర్టిఫికేట్ తో జాబ్ తెచ్చుకుని ఉంటాడు. స్కామ్ బయటపడడంతో ఉద్యోగం ఊడుతుంది.  దాంతో ఆ స్కామ్ వెనుక ఉండే వారిని పట్టించేందుకు రెడీ అవుతాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రం కొన్ని మార్పులు చేస్తున్నారట. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన TN సంతోష్ తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం.

No comments:

Post a Comment