వరుణ్ తర్వాత మహేష్‌బాబుతో..?


ఇప్పటి వరకు ఉన్న ఫ్లాప్ రికార్డులను ఈ చిత్రంతో చెరిపేసుకునేందుకు దర్శకుడు శ్రీనువైట్ల ఉబలాట పడుతున్నాడు. శ్రీనువైట్లకు ‘ఆగడు’ చిత్రం ఫ్లాప్ అయినప్పటికి మహేష్‌బాబు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. అయితే మెగా హీరోతో చేయబోతున్న ఈ సినిమా సక్సెస్ అయితే ఆ అవకాశం దక్కే అవకాశాలున్నాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం శ్రీనువైట్ల, వరుణ్ తేజ్‌ల సినిమా సక్సెస్ అయితే ఖచ్చితంగా మహేష్‌బాబు, శ్రీనువైట్లల కాంబినేషన్‌లో మరో సినిమా రావడం ఖాయం అని అంటున్నారు. మరి ముందున్న ఈ అవకాశాన్ని శ్రీనువైట్ల ఉపయోగించుకుంటాడా అనేది చూడాలి.
No comments:
Post a Comment