Saturday 30 January 2016

Nannaku Prematho First Movie of Junior NTR has crossed 50 Cr

2 వారాల్లోనే రూ. 50 కోట్ల షేర్‌- భోగవల్లి ప్రసాద్‌


‘‘చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 30 వసంతాలు పూర్తైంది. ఈ ప్రయాణంలో హిట్లు, ప్లాపులూ తీశాను. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్లామా లేదా అన్నది పక్కనపెడితే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. నిర్మాతగా 30 ఏళ్ల జర్నీ అంటే మామూలు విషయం కాదు’’ అని భోగవల్లి ప్రసాద్‌ అన్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. సంక్రాంతికి విడుదలై విజయవంతంగా ఆడుతున్న సందర్భంగా ప్రసాద్‌ శనివారం విలేకరులతో మాట్లాడారు.
 
ఆ విషయాలు ఆయన మాటల్లోనే...సుకుమార్‌ మంచి టెక్నీషియన్. అతని ఆలోచనలు కొత్తగా ఉంటాయి. ఆయన చెప్పిన కథలో ‘తండ్రి కోసం కొడుకు పడే తపన’ అన్న పాయింట్‌ బాగా నచ్చింది. విలువలు మరచిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి కథ అవసరం అనిపించింది. అందుకే ఈ సినిమా చేశా. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా తీశారని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. పండగ సీజన్‌లో విడుదల చెయ్యడం చాలా ప్లస్‌ అయింది. ఇప్పుడొస్తున్న ఏ సినిమాకైనా మొదటి రోజు మిశ్రమ స్పందనే వస్తుంది. ‘బాహుబలి’కి అటువంటి స్పందనే వచ్చింది. అయినప్పటికీ ఆ సినిమా నిలబడగలిగింది. అలాగే మా సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. క్లాసు, మాసు అనే భేదాలు ప్రేక్షకుల్లో లేవు. కథ బావుంటే ఏ సినిమా అయిన చూస్తారు. ఈ సినిమాను హైదరాబాద్‌, ముంబయి నేపథ్యంలో కూడా తీయొచ్చు. కానీ ఫ్రెష్‌నెస్‌ కోసం లండన్ నేపథ్యంలో తీశాం. అదే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓవర్సీస్‌లో కూడా సినిమాకు మంచి స్పందన వస్తోంది. రెండు వారాల్లో రూ.50 కోట్ల షేర్‌ క్రాస్‌ చేయడం ఆనందంగా ఉంది.
 
డబ్బుంటే నిర్మాతే...
చెన్నైలో పరిశ్రమ ఉండగా సినిమా మీద అవగాహన, ప్రేమ ఉన్నవారు మాత్రమే సినిమాలు తీసేవారు. ఇప్పుడు సినిమా అంటే ఎటువంటి అవగాహనా లేకుండా డబ్బున్న ప్రతి ఒక్కరూ నిర్మాతలైపోతున్నారు. అందుకే సక్సెస్‌ఫుల్‌ సినిమాలు తక్కువయ్యాయి. నిర్మాత క్యాషియర్‌గా మారాడు అంటే నేనొప్పుకోను. సినిమా నిర్మాణంలో ప్లానింగ్‌ ఉన్న ఏ నిర్మాతకీ వాల్యూ తగ్గలేదు. నేనైతే దర్శకుడికి స్వేచ్ఛ ఇస్తా. అతని పనిలో జోక్యం చేసుకోను. నిర్మాతగా సినిమాకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తా. ప్రస్తుతం నాలుగు కథలు చర్చల్లో ఉన్నాయి. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. అది ఓ కొలిక్కి వచ్చాక. తదుపరి చిత్రం గురించి చెబుతా. కథ బావుంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు తీస్తా.

No comments:

Post a Comment