Tuesday, 15 March 2016

Power Star upcoming movie updates

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత చేయబోయే సినిమా ఖుషి సీక్వెల్ అన్న విషయం ఇప్పుడు ఓల్డ్ న్యూస్ అయిపొయింది.  ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్రెడీ ముంబై లో మొదలయ్యాయి కదా. SJ సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.   పవన్ కొత్త సినిమా న్యూస్ అంతటితో ఆగలేదు.  ఈ సినిమాకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి.  అలాంటి అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకు రైటర్ ఆకుల శివ కథ అందిస్తున్నాడట. Capturewhite
మొదట డైరెక్టర్ SJ సూర్య ఈ సినిమాకు కథ తయారు చేశాడట.  ఈ సినిమా బేసిక్ ప్లాట్ వినిపించినప్పుడు పవన్ ఓకే అన్నాడట గానీ ఫుల్ స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత నచ్చలేదట. ఇదే సమయంలో ఆకుల శివ చెప్పిన కథ పవన్ ను బాగా ఇంప్రెస్ చేసిందట.  దీంతో SJ సూర్య తో తన కథను పక్కనబెట్టి ఆకుల శివ కథను డైరెక్ట్ చేయమని చెప్పాడట  ఇంతకీ ఆకుల శివ గురించి చెప్పలేదు కదా.. VV వినాయక్  సినిమాల్లో చాలా వాటికి ఆకుల శివ కథ అందించాడు..  . సో.. కథ శివది కాబట్టి పవన్ ఫ్యాన్స్  SJ సూర్య విషయంలో మరీ కంగారు పడాల్సిన పని లేదు.

No comments:

Post a Comment