Monday 14 March 2016

బాహుబలి-2 లో ఛాన్స్ కొట్టేసిన మరో హీరోయిన్ !

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి బ్లాక్ బస్టర్ కావడంతో ప్రేక్షకులకు బాహుబలి 2 పైన ఆసక్తి పెరిగింది. ప్రేక్షకుల సంగతి సరే, చాలామంది నటీ నటులు బాహుబలి లో నటించే అవకాశం తమకు రాలేదని, అలాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే చిన్న రోల్ అయిన తప్పనిసరిగా చేస్తామన్నారు. ఇలా చెప్పిన వారిలో అక్కినేని నాగార్జున, తమిళ హీరో సూర్య కూడా ఉన్నారు.  అలాంటి క్రేజీ మూవీ బాహుబలి లో నటించే అవకాశం శ్రియకు వచ్చింది.  బాహుబలి-2 లో శ్రియ భల్లాలదేవుని భార్య పాత్ర లో కనిపిస్తుందట.  Capturewhite
గతంలో ఈ పాత్ర లావణ్య త్రిపాఠి ని ఎంపిక చేశారు అని వార్తలు వచ్చాయి గానీ, ఎందుకో ఆమెకు అవకాశం దక్కలేదు.  రీసెంట్ గా రానాకు, శ్రియకు కలిపి ఫోటో షూట్ చేశారట.  రానా, శ్రియ  జంట చక్కగా కుదరడంతో భల్లాలదేవుని భార్య పాత్రకు శ్రియనే ఫైనల్ చేశారట.  ప్రస్తుతం బాహుబలి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది.  త్వరలో శ్రియ బాహుబలి టీం తో జాయిన్ అవుతుందట.  మనం సినిమా తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు లేని శ్రియకు ఇది గోల్డెన్ ఆఫర్ అని చెప్పుకోవాలి.

No comments:

Post a Comment