Express Raja Review
విడుదల తేదీ : 14 జనవరి 2016
 రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : మేర్లపాక గాంధీ
నిర్మాత : వంశీ, ప్రమోద్
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
నటీనటులు : శర్వానంద్, సురభి, సప్తగిరి, ప్రభాస్ శ్రీను…


తీర్పు :
కామెడీ అనే జానర్‌కు ఏ భాషలో అయినా ఎప్పుడూ మంచి ఆదరణ కనిపిస్తుంది. ఆ కామెడీ అర్థవంతంగా ఉండి, దానికి లాజిక్, కొంత డ్రామా కూడా తోడైతే అవి మర్చిపోలేని సినిమాలుగా నిలుస్తాయి. అదే లాజిక్ మిస్ అయి, డ్రామా లేని సినిమాలైతే సరదాగా అప్పటికి నవ్వుకొని, అప్పుడప్పుడూ ఎంజాయ్ చేసే సినిమాలుగా నిలుస్తాయి. ఎక్స్‌ప్రెస్ రాజా సరదాగా సాగిపోయే రెండో రకం సినిమా! సరికొత్త స్క్రీన్‌ప్లే, విచిత్రమైన పాత్రలతో ఆద్యంతం నవ్వించే పాత్రలు, మంచి కామెడీ టైమింగ్ నింపుకొని వచ్చిన సన్నివేశాలు, నటీనటులంతా బాగా నవ్వించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్ సాదాసీదాగా ఉండడం, లాజిక్ అన్న మాటకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఎమోషన్ లేకపోవడం వంటివి మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే సరదాగా, పెద్దగా లాజిక్ లేకున్నా ఫర్వాలేదు కానీ మంచి కామెడీ ఉంటే చాలు అనుకునేవారికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఆప్షన్. లాజిక్ వెతకకుండా చూస్తే హాయిగా నవ్వించే సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’!