Monday 4 January 2016

Bangalore Days First Look

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘బెంగళూరు డేస్‌’ చిత్రాన్ని ఆర్య, బాబీసింహా, రానా, శ్రీదివ్య, పార్వతి, రాయ్‌లక్ష్మీ ప్రధాన తారాగణంగా తమిళంలో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ భాస్కర్‌ తెరకెక్కిస్తున్న ఈ మల్లీస్టారర్‌ ఫస్ట్‌ లుక్‌ను న్యూ ఇయర్‌ కానుకగా విడుదల చేశారు. ఆర్య, బాబీసింహా, శ్రీదివ్యలతో కూడిన ఫస్ట్‌ లుక్‌ చాలా కలర్‌ఫుల్‌గా ప్రేక్షకుల్ని అమితంగా ఆకర్షిస్తోంది. పీవీపీ సినిమాస్‌ నిర్మిస్తున్న ‘బెంగళూరు డేస్’లో సమంత అతిథి పాత్ర పోషిస్తోంది. గోపీ సుందర్‌ సంగీతం, కేవీ గుహన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. షూటింగ్‌ తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల చేసే అవకాశం ఉంది.

No comments:

Post a Comment